

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని నల్లకుంట శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాలు సంబరాల కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు బోనాలతో పోతురాజులు ఆటలతో డప్పు వాయిద్యాలతో ఆడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తెలియజేస్తూ సుంకులమ్మ దేవాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి నైవేద్యం సమర్పించి అమ్మవారి ఆశిస్సులు తీసుకున్నారు.తర్వాత పాఠశాలకు చేరుకొని సాంస్కృతిక నృత్యాలతో అలరించారు.దీనిలో ప్రధానోపాధ్యాయులు శ్రీ విజయరత్నం మరియు డీన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి ,zonal a.o లక్ష్మీ పుత్ర శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.