

మన న్యూస్ చిత్తూరు జులై-18:- ఈరోజు చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు గౌరవ ఏడి వెంకటేశ్వరరావుని కలిసి వినతి పత్రం సమర్పించడం అయినది. పదవ తరగతి పరీక్షలు పూర్తయి మూడు మాసాలైనా ఇంతవరకు పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన రెమ్యునరేషన్ చెల్లించలేదని వెంటనే చెల్లించడానికి చర్యలు చేపట్టాలని తెలియజేయడమైనది. అలాగే చిత్తూరు జిల్లాలో బదిలీలకు ముందు ఇచ్చిన ప్రమోషన్లలో సోషల్ స్టడీస్, గణితం, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి పదోన్నతుల పోస్టులు మిగిలిపోయాయని , వెంటనే మిగిలిన పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేసినట్లయితే సబ్జెక్టు నిపుణుల కొరత ఉన్న పాఠశాలలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను కూడా పదోన్నతి ద్వారా భర్తీ చేయాలని తెలపడం అయినది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమల్లో భాగంగా వివిధ ప్రాథమిక పాఠశాలలకు నేరుగా సరఫరా చేయకుండా క్లస్టర్ కేంద్రాల్లో సన్న బియ్యం, రాగి పిండి ఇస్తున్నారని దీనివలన ప్రాథమిక పాఠశాలల కేంద్రాలకు తీసుకు వెళ్లడానికి ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని కావున నేరుగా క్లస్టర్ పాఠశాలల్లో కాకుండా సరఫరా చేయవలసిన పాఠశాలలకు నేరుగా పంపిణీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టియూ రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు ఘంటా మోహన్, చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్ యాదవ్ మరియు సంఘ నాయకులు లింగమూర్తి యాదవ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.