

కొత్తపేట, మన న్యూస్: 21 ఏళ్ల సుష్మిత ప్రమాదవశాత్తూ 4వ అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలతో ఓజోన్ హాస్పిటల్‌కి తీసుకువచ్చారు. భారీ రక్తస్రావం, తక్కువ బీపీ కారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. అయితే ఓజోన్ వైద్య బృందం సమయానుకూలంగా స్పందించి ప్రాణాలను నిలబెట్టగలిగింది. వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేసి అత్యవసర చికిత్స ప్రారంభించారు. రెండు తొడల ఎముకలు విరగడం, పెల్విస్, చేయి, మోకాలు, మడమల గాయాలకు ఆధునిక శస్త్రచికిత్సలు చేశారు. ప్రస్తుతం సుష్మిత జనరల్ వార్డుకు షిఫ్ట్ అయింది. కదలికలు ప్రారంభమయ్యాయి. ఫిజియోథెరపీ సహాయంతో నడక సాధన కొనసాగుతోంది.ఈ విజయానికి తోడ్పడిన వైద్యులు:ఆర్థోపెడిక్స్: డా. కళ్యాణ్, డా. రాఘవ ఆదిత్య, జనరల్ సర్జన్: డా. సురేష్ రెడ్డి ,న్యూరో సర్జన్: డా. నిఖిల్ ,పల్మనాలజీ: డా. వికాస్, ఐసీయూ: డా. రాజేష్, ఆనస్తీషియా: డా. విజయ్ కుమార్, ఫిజియోథెరపీ: డా. సాయి తేజ అండ్ టీమ్, జనరల్ మెడిసిన్: డా. ఇంద్రసేన్ రెడ్డి, ఎమర్జెన్సీ ఫిజిషన్: డా. సుష్మా, వైద్యుల సమిష్టి కృషితో శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో సుష్మిత ప్రాణాపాయం నుంచి బయటపడింది.