మామిడి రైతులపై జగన్ రెడ్డి కుట్రలు మరొకసారి బట్టబయలు…రైతుల ద్రోహి జగన్ రెడ్డి – రాష్ట్ర యాదవ కార్పొరేషత్ చైర్మన్ నరసింహ యాదవ్

మన న్యూస్,తిరుపతి :– వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులపై కుట్రపూరిత అనాలోచిత నిర్ణయాలు కర్ణాటక సాక్షిగా మరొకసారి బట్టబయలు అయ్యాయని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. రేణిగుంట రోడ్ లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తోతాపూరి మామిడి ఉత్పత్తి ఏడాదికి సగటున 2.5 లక్షల టన్నులు ఉంటుందన్నారు. కానీ ఈ ఏడాది ఏడు లక్షల టన్నులకు పంట దిగుమతి జరిగిందన్నారు. పెద్ద ఎత్తున మామిడికాయలు మార్కెట్ కు రావడంతో ధర పడిపోతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా రైతులను ఆదుకునేందుకు సత్వర చర్యలు చేపట్టిందన్నారు. రైతులు అడగకముందే కిలోకు నాలుగు రూపాయల సబ్సిడీని అందించి రైతన్న వద్దనున్న ఆఖరి కాయ వరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలిచ్చిన అలజడి సృష్టించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేశాడన్నారు. తోతపురి మామిడి కి కర్ణాటక రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్లో ధర ఎక్కువగా ఉందని కావున మాకు ఏపీలో అమ్ముకోవడానికి అనుమతించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు అన్నారు. కర్ణాటకలో కేజీ మామిడి నాలుగు రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదని ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే మంజునాథ్ చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అక్కడ 16 రూపాయలకు కేజీ కొంటున్నారని తప్పుడు ప్రచారం చేసి రైతుల్లో ఆందోళన కలిగించిన రైతుల ద్రోహి వైసిపి నాయకులని పేర్కొన్నారు. బంగారుపాళ్యంలో రైతులను పరామర్శించే పేరుతో మార్కెట్ యార్డుకు వెళ్లి కార్యకర్తలతో రైతుల ముసుగేసి పట్టపగలు భీమోత్సవం సృష్టించి నిజమైన రైతులను స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మీడియాపై దాడులకు దిగిన వైసిపి దండుపాళ్యం బ్యాచ్ అంటే తప్పేముందన్నారు. రైతుల కష్టాన్ని అవమానిస్తూ రోడ్లపై మామిడికాయల పారిపోసి కార్లు ట్రాక్టర్లతో తప్పించడం వైసిపి రైతు వ్యతిరేక చర్యలు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బల్బుపై ఉన్న జీఎస్టీని తీసివేయాలని జూసీలపై ఉన్న జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాసి రైతులకు అండగా నిలబడ్డారని నరసింహ యాదవ్ గుర్తు చేశారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 4 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.