

మన న్యూస్,తిరుపతి :
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని తిరుపతిలో శుక్రవారం రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి వచ్చారు. బిజెపి పార్టీ నాయకుల సమక్షంలో ఒక ప్రైవేటు హోటల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కలసి శాలువ తో ఘనంగా సత్కరించి మేమెంటో అందజేశారు.