బలవంతపు పాఠశాలల విలీనం ఆపాలి..కె.వి.పి.యస్.సి.ఐ.టి.యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండలం పరిధిలోని నెర్నూరు ఎస్సీ,ఎస్టీ,కాలనీలలో గురువారం నాడు కె.వి.పి.యస్.సి.ఐ.టి.యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో “ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాల పేద పిల్లలను చదువులకు దూరం చేయొద్దు – బలవంతపు పాఠశాలల విలీనం ఆపాలి”అంటూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం విస్తృతంగా పర్యటించి పాఠశాలలకు దూరం అయిన విద్యార్థులు తల్లిదండ్రులు కలవడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ కూ టమి ప్రభుత్వం పాఠశాలల విలీనం ప్రక్రియతో జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొనడం జరిగింది. విద్యాహక్కు చట్టం – 2009 కి తూట్లు పొడుస్తూ గత వైసిపి ప్రభుత్వానికి వంత పాడుతూ జిల్లాలో సుమారు 580 ప్రాథమిక పాఠశాలలను విలీనం చేస్తున్నారు అని, పిల్లలను రాజ్యాంగ విరుద్ధంగా కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాలకు తరలిస్తూ బలవంతంగా మూడు, నాలుగు,ఐదు, తరగతులు పిల్లలను విలీనం చేయడం వల్ల ఎస్సీ,ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించిన వందలాదిమంది పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని, దూర ప్రాంతాలకు తమ చిన్న పిల్లలను పంపలేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు, “మా బడిలోనే – మా పిల్లలను ఉంచాలని” రోడ్లమీదకు వచ్చి నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారని, అప్ర జాస్వామికంగా చేస్తున్న పాఠశాలల విలీనాన్ని ఆపాలని విద్యార్థి మరియు ప్రజా సంఘాలు, నెలరోజుల నుండి నిరసనలు ధర్నాలు చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ బలవంతపు పాఠశాలల విలీనం వలన పసిపిల్లలను రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లే పరిస్థితి లేదు, రోడ్లు, కాలువలు, హైవేలు, దాటి స్కూళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. మూడు,నాలుగు, ఐదు, తరగతులు పిల్లలు వెళితే ఒకటి,రెండు,తరగతి పిల్లలు తగినంత మంది లేక జిల్లాలో వందలాది పాఠశాలలు మూత పడతాయని, క్రమేపి పాఠశాల మూసివేతను ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. కార్పొరేట్ విద్య, కొనసాగలేక, ప్రభుత్వ విద్య అంధక పేద విద్యార్థులు చదువులు ‘ డ్రాప్ అవుట్’ దిశగా అడుగులు వేయక తప్పదని, వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇచ్చినా వెంటనే పురా ఆలోచించి, తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని, వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు అడపాల ప్రసాద్ గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, గూడూరు పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య,దర్శి. నాగభూషణం, పుట్టా శంకరయ్య,రమేష్, ఏంభేటీ చంద్రయ్య, బి.చంద్రయ్య,ఆర్.చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..