

మన న్యూస్ సాలూరు జూలై 9:-పార్వతీపురం మన్యం జిల్లా. సాలూరు జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు జరిగిన సమ్మె కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణము నుండి మెయిన్ రోడ్డు చిన్న బజారు వేద సమాజం శివాజీ బొమ్మ జంక్షన్ మీదుగా బోసు బొమ్మ వరకు ర్యాలీ చేపట్టి అక్కడ సభ జరిగింది. సభను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు రద్దుచేసి కార్మికులకు రక్షణగా ఉన్న పీఎఫ్ కనీస వేతనం ఉద్యోగ భద్రత వంటి చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రిటైర్మెంట్ సందర్భంగా ఎలాంటి బెనిఫిట్స్ లేకుండానే ఇంటికి పంపుతున్నారని రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించాలని తెలిపారు సమాన పనికి సమానత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే అధిక ధరలు తగ్గించి ప్రజలపై భారాల ఆపాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కార్మికులందరికీ అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కె ఈశ్వరరావు, కృష్ణారావు, గౌరీ శ్రీదేవి,రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అసిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఇందు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.