

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-9
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో బుధవారం రైతుల కష్టసుఖాలు తెలుసుకునేందుకు బెంగళూరు నుండి బంగారుపాల్యం కు హెలికాప్టర్ లో కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11:30 గంటలకు రావడం జరిగింది. తదుపరి హైవే బైపాస్ నుండి రెండు గంటల పాటు రైతులను పరామర్శించుకుంటూ, మామిడికాయలను రైతులు ట్రాక్టర్లలో తీసుకొచ్చి పడవేసిన దృశ్యాలను గమనిస్తూ మ్యాంగో మార్కెట్ నందు మధ్యాహ్నం 1:30 గంటలకు వైయస్సార్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మ్యాంగో మార్కెట్ నందు ప్రవేశించారు. బంగారుపాలెం మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏడాది కాలం కష్టపడి పండించిన మామిడి కాయల గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మామిడికాయల మండి చేరుకొని రైతు సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రైతులు పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న విషయంపై రైతులనుఅడిగి తెలుసుకున్నారు. ఒకకేజీ మామిడికాయల కు మూడు రూపాయలు ఇస్తున్నారని రైతులు మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మూడు రోజుల క్రితం రెండు రూపాయల మాత్రమే రైతుకు గిట్టుబాటు ధర పలికింది. ఇందుకు స్పందించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిఏడాది కాలం పండించిన మామిడికాయలకు గిట్టుబాటు ధర లేక రైతులు కనీసం కూటమి ప్రభుత్వం నిర్ణయించిన ఎనిమిది రూపాయలైనా కేజీకి ఇస్తే రైతు సంతోషంగా ఉండవచ్చునని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయలు కలిపి 12 రూపాయలు వస్తుందని భావించిన రైతులు చివరికి ఏడు రూపాయల వరకు అమ్ముకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అది కూడా ర్యాంపుల వారు, ఫ్యాక్టరీ ల వారు డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా రైతుకు తెలపడం లేదు. తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే వ్యాపారస్తులు ప్రస్తుతం బంగారు పాల్యం కు వ్యాపారానికి రావడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చకపోవడం దారుణంగా ఉందని అన్నారు. రైతులకు ప్రభుత్వం మామిడికాయల ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మామిడి రైతులు మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి అంటూ మ్యాంగో మార్కెట్ లోకి అనుమతులు లేకున్నా ప్రవేశం చేశారు. దీంతో పోలీసులకు కొంతసేపు చిరాకు వేసి మామిడి రైతులను ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. మీపై కేసులు పెడతామని చెప్పిన రైతులు ఏమాత్రం పట్టించుకోక మధ్యాహ్నం 12 గంటల తర్వాత మ్యాంగో మార్కెట్లోకి ప్రవేశించారు. తదుపరి ఒకటిన్నర గంటల తర్వాత జగన్తో ర్యాలీలో వేలాది సంఖ్యలో మార్కెట్లోకి మామిడి రైతులు దూసుకు రావడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా కేంద్రానికి లేఖ పంపుతానని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రముఖ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.