

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి పేద ప్రజల హృదయాధినేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. 76వ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మండలంలో ఓమ్మంగి, ప్రత్తిపాడు గ్రామాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ముద్రగడ గిరిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో గిరిబాబు కేకు కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. గిరిబాబు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, జల యజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్ అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేదవానికి నేనున్నానంటూ భరోసా ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ రెడ్డిని ఆయన మరణించిన ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారు. ఓమ్మంగి సర్పంచ్ తుమ్మల భవాని పేదలకు ఏర్పాటుచేసిన చీరలు పంపిణీ కార్యక్రమాన్ని గిరిబాబు ప్రారంభించి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామిశెట్టి నాని, జడ్పిటిసి బెహరా రాజేశ్వరి, ఎంపీపీ గొళ్ల కాంతి సుధాకర్, దలే చిట్టిబాబు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.