

మన న్యూస్ పాచిపెంట,జూలై 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం పరుగులు తీస్తోందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గూడెపు యుగంధర్ అన్నారు. మంగళవారం నాడు పాచి పెంట మండలం మిర్తి వలస పంచాయతీ తోట వలస గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో భాగంగా ఇంటింటికి ఏడాదిలో జరిగిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తోందని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా..లేదా అని అక్కడ ఉన్న ప్రజలను ప్రశ్నించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెల్లే బాధ్యత మనందరిపై ఉందని కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కోరారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం మన ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం,అభివృద్ధి గురించి తేడా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అందుతాయని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదని తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి సమపాలల్లో పరిపాలన అందిస్తున్నామని మీరంతా సహకరించాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికలకు మనమంతా సిద్ధం కావాలని పార్టీకి ఘన విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఉపాధ్యక్షులు కొత్తల పోలినాయుడు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మతల బలరాము,ఏ ఎం సి డైరెక్టర్ పి నర్సింగరావు, మిర్తి వలస సర్పంచ్ కే సత్యవతి,ఎం మజ్జా రావు,దండి మోహనరావు, తదితరులు హాజరయ్యారు.
