

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్, మార్కెట్ సెంటర్, కుమ్మర వీధి సెంటర్,ఆదిశంకర కాలేజ్, రైల్వే స్టేషన్,విందూరు, మిఠాత్మకూరు, బద్దవోలు, ఆటో స్టాండ్ లలో మంగళవారం నాడు సి.ఐ.టి.యు ఆటో యూనియన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు బి.వి. రమణయ్య ఆయా ఆటో స్టాండ్ ల లోని నాయకులను, కమిటీ సభ్యులను, కార్మికులను, కలిసి సమ్మె సంబంధించిన “కరపత్రాలను”, “దేశవ్యాప్త సమ్మె”ను జయప్రదం చేయండి స్టిక్కర్లను ఆవిష్కరించి ఆటోలకు అంటించడం జరిగింది. అనంతరం ఆటో కార్మికుల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రవాణా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు, కట్టబెట్టే మోటార్ వాహన చట్టం 2021. భారత సంహిత (బి.ఎన్.ఎస్) చట్టం 16 లను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని లైసెన్స్, రిజిస్ట్రేషన్, రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఆర్టీవో కార్యాలయంలోనే యథా విధంగా నిర్వహించాలని, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రూరల్ పరిధిలో “తొండమానుపురం” వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను, (సెన్సార్ ట్రాకింగ్ సిస్టం) రద్దు చేయాలని, పెంచిన గ్రీన్ టాక్స్, పెనాల్టీలు, చలానాలు పెంచుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీ.వో నెంబర్ 21ని రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిపోతున్న ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలో భాగంగా వాహన మిత్ర ప్రతి డ్రైవర్ కు 15,000/- వేలురూపాయలు చొప్పున వెంటనే చెల్లించాలని, ఆయన డిమాండ్ చేశారు. జూలై 9 న దేశవ్యాప్త సమ్మె లో రవాణా రంగ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, ఏంబేటి చంద్రయ్య, సి.ఐ.టి.యు ఆటో సంఘం నాయకులు బి.రమేష్, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణ, సుధీర్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు,రమేష్, భాషా భాయ్ తదితరులు పాల్గొన్నారు.
