

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 7 :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని సోమవారం వర్కింగ్ జర్నలిస్టులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎందుకు వారు సానుకూలంగా స్పందించి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇంటి స్థలాలు లేని వారికి ప్రభుత్వ స్థలం గుర్తించి ఇంటి స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టులు ముకుందరావు వెంకట్రావు వెంకటేష్ గౌడ్ నాగరాజు కే వెంకటేష్ జి వెంకటేష్ బలరాం తిరుమల్ కృష్ణ ధరూరు కృష్ణ రాఘవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.