

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 07 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని లాలాసాబ్ పీర్ల మొహార్రం సందర్భంగా గ్రామ ప్రజలు కుల ,మతం, భేదాలు లేకుండా అందరూ కలిసిమెలసి లాలాసాబ్ పీర్ల మొహార్రం నిర్వహించారు. సొమవారం తెల్లవారుజామున 4:15 నిమిషాలకు లాలాసాబ్ భక్తులు అగ్నిగుండంలో దిగిన భక్తులు అనంతరం లాలాసాబ్ పీర్ల ను ఊర్లో ఉరేగించుకుంటు లాలాసాబ్ కే దిన్ దిన్ అంటు పరుగులు తీశారు తెల్లవారుజామున పీర్ల మసీదులో పెట్టి సాయంత్రం 4:00 సమయంలో లాలాసాబ్ పీర్ల ను మళ్ళీ ఊర్లో వీధుల్లో ఉరేగించి అనంతరం ఊరి సమీపంలో ఉన్న వాగు దగ్గర మొహార్రం చేశారు. మొహార్రం అనంతరం హస్సేన్ హుస్సేన్ ఆల్పిదహ అంటూ పాటలు పాడుతూ ఊర్లోకీ వస్తారు.
