

గూడూరు, మన న్యూస్ :- వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్నారై వింగ్ గ్లోబల్ కోఆర్డినేటర్ అయిన ఆలూరు సాంబశివారెడ్డి గారిని వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు జగనన్న సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఊటుకూరు మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా విజయవాడలోని ఆయన నివాసంలో కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన బయట మీడియాతో మాట్లాడుతూ నా సోదరుడు నా శ్రేయోభిలాషి ని వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉందని ఆయన ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నానని తెలియజేశారు.