

గూడూరు ,మన న్యూస్ :- మోడీ బిజెపి ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతున్న 44 చట్టాలలో ముఖ్యమైన 29 చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లును కార్మిక వర్గానికి మరణశాసనంగా ఏర్పాటు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు లోని సి.ఐ
టి.యు కార్యాలయంలో ఆదివారం ఉదయం ఏర్పాటుచేసిన ప్రజాసంఘాల విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ కోడ్ ల ద్వారా సంఘాలు పెట్టుకోవడం, కష్టతరం అవుతుందని, సంఘం బేరసారాల శక్తిని కోల్పోతాయని, యజమానికి విపరీతమైన అధికారాలు అప్పజెప్పడం అవుతుందని, సాధారణ కార్మికులకు ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్ బోనస్, గ్రాడ్యుటి,పెన్షన్, అందని ద్రాక్ష పండ్లు అవుతాయని, కనీస వేతనం అమలు కాదు, క్యాంటీన్ అంబులెన్స్, లాంటి కనీస సౌకర్యాలు కూడా ఇబ్బందులు ఏర్పడతాయని, కాంట్రాక్టర్ల చెల్లింపు ఎగువేతలకు యాజమాన్యం (ప్రిన్సిపల్ ఎంప్లాయిస్) బాధ్యత వహించదని, పనిగంటలు 12 గంటలకు పెంచుతారని మహిళలు రాత్రి పూట పని చేయాలి. కార్మికుల రక్షణకు సేఫ్టీ ఆఫీసురు గాని, వెల్ఫేర్ ఆఫీసర్ గానీ, ఇకపై ఉండరని జీతాలు చెల్లింపు యజమాని దయాదాక్షన్యాల మీద ఆధారపడి ఉంటుందని, ఆయన తెలియజేశారు. ఈ ప్రమాదకరమైన కోడ్ లు రద్దు చేసేందుకు జూలై 9న దేశవ్యాప్త సమ్మెను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. పామంజి మణి అధ్యక్షతన జరిగిన సి.ఐ.టి.యు మండల విస్తృత సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బీ.వీ. రమణయ్య, ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, అంగన్వాడి అధ్యక్ష,కార్యదర్శులు ఇంద్రావతి, ప్రభావతి, ఆశ సంఘం నాయకురాలు ఉష, వి.ఆర్.ఏ సంఘం నాయకులు సుబ్బయ్య, రామయ్య, కెవిపిఎస్ నాయకులు అడపాల ప్రసాద్, ఆటో సంఘం నాయకులు భాస్కర్ రెడ్డి, మహబూబ్ బాషా, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గండికోట మధు, బండి కిష్టయ్య, జిలాని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నారాయణ, ముత్యాలయ్య, మున్సిపల్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ధారా కోటేశ్వరరావు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
