సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామస్థులు శుక్రవారం
చిన్న కొడప్ గల్ సొసైటి అధ్యక్ష కార్యదర్శులు జార నాగిరెడ్డి, హన్మండ్లు సన్మానం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ ..దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో చిన్న కొడప్ గల్ సొసైటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో
ప్రథమ స్థానంలో నిలిచి అవార్డ్ ను అందుకుందని తెలిపారు.ఉమ్మడి జిల్లాలో ప్రథమ స్థానం సాధించినందుకు గాను అధ్యక్ష,కార్యదర్శులకు సన్మానం చేశామని తెలిపారు.అధ్యక్ష కార్యదర్శులు అందుబాటులో ఉండి రైతులకు సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు.రుణగ్రహీతలకు అవగాహన కల్పించి సమయానికి అప్పులు చెల్లించే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు.రైతులకు సకాలంలో పంట రుణాలు,ఎరువులు ,విత్తనాలు అందజేస్తున్నారని తెలిపారు.అలాగే సొసైటి అ ధ్వర్యంలో చిన్న కొడప్ గల్, పారడ్ పల్లి,కాటేపల్లి,అల్లాపూర్,బుర్నాపూర్,ధర్మారం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి,జొన్నలు కొనుగోలు చేసి రైతులకు సహకారం అందిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం సహకార వారోత్సవాల్లో భాగంగా కాటేపల్లి గోదాం ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఉపాధ్యక్షులు గంగాగౌడ్ , జీపి కార్యదర్శి ప్రదీప్,
డైరెక్టర్లు పెంటయ్య,సాయిలు,రైతులు శంకర్,చాంద్ పాషా,రమేష్,రవీందర్,మొగులయ్య,సొసైటి సిబ్బంది రమేష్,సాయిలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆంధ్రప్రదేశ్ జూనియర్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా యం శీనయ్య

    మన న్యూస్,నెల్లూరు:వెటర్నరీ ఆఫీసర్ యడవల్లి మల్లికార్జున జూన్ 30 న ఉద్యోగ విరమణ చేయడంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ జూనియర్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడి గా బుధవారం రాష్ట్రనాయకులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి ఆయనస్థానంలో నూతన నాయకత్వాన్ని…

    జుక్కల్ నియోజకవర్గానికి రూ.32.20 కోట్ల నిధులు మంజూరు.

    మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గానికి చెందిన గ్రామాల రహదారి సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హైదరాబాద్ లో కలుసుకున్నారు.ఈ సమావేశంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    • By RAHEEM
    • July 5, 2025
    • 4 views
    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

    సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…

    సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…