

ప్రజల మద్దతు కూడగట్టుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
ప్రతి కుటుంబాన్ని కలిసి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాల అమలును వివరిస్తున్న ఎమ్మెల్యే..
మన న్యూస్ ఐరాల జులై-2
పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, వడ్రాంపల్లె పంచాయతీ పరిధిలో *“సుపరిపాలనతో తొలి అడుగు”* ఇంటింటి కార్యక్రమం పండుగలా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా *“రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు”* ఆదేశాల మేరకూ పూతలపట్టు నియోజకవర్గంలో బుధవారం నుండి ప్రారంభమైన సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజల మద్దతు కూడగట్టుకుని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్కి”* ప్రజల కర్పూర నీరాజనాలతో స్వాగతం పలుకుతున్నారు. వడ్రాంపల్లె, దామరగుంట, మిట్టిండ్లు, లింగారెడ్డి యిండ్లు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలులో ఉన్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. అనంతరం వడ్రాంపల్లె గ్రామంలో ప్రజల నుండి విన్నతులు స్వీకరించారు. గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం
తామరగుంట గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలకి ఆకస్మికంగా చేరుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్ విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా స్థితిగతులపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వసతులపై విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో సంభాషిస్తూ ప్రభుత్వ సేవలు సకాలంలో అందుతున్నాయా అనే అంశంపై చర్చించారు. ప్రభుత్వం ప్రతి హామీని నెరవేరుస్తోందని, ప్రజల మద్దతుతోనే ఈ మార్పు సాధ్యమవుతుంది” అని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల అధ్యక్షులు హరిబాబు నాయుడు, మాజీ మండల అధ్యక్షులు గురిధర్ బాబు మరియు పూతలపట్టు నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, మరియు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.
