

గూడూరు, మన న్యూస్ :- క్షయ వ్యాధిగ్రస్తుడు యస్దాని వైద్య ఖర్చులకోసం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 15వేల రూపాయలను ట్రస్ట్ సభ్యులు ప్రజేంద్రరెడ్డి ద్వారా బుధవారం బాధితుడికి అందజేశారు. చిల్లకూరు మండలం పారిచర్ల వారి పాలెంలో నివాసం ఉండే యస్దాని గత కొన్నేళ్లగా క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు.బాడుగు ఇంట్లో ఉంటూ వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న అతని కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న రాజనేని శ్రీనివాసులు నాయుడు వెంటనే స్పందించి వైద్య ఖర్చులకోసం నగదును అందజేసినట్లు ట్రస్ట్ సభ్యుడు ప్రజేంద్రరెడ్డి తెలియజేశారు.
