

మన న్యూస్ పూతలపట్టు జులై-2
పూతలపట్టు మండలం, కమ్మగుట్టపల్లె పంచాయతీ పరిధిలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారానికి విచ్చేసిన *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి”* మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కమ్మగుట్టపల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలును ప్రజలకు క్షుణ్ణంగా వివరించి కరపత్రాలను అందించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పధకాలు అందుతున్నాయా లేదా అంటూ ఆరా తీశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ మాట నిలబెట్టుకుందని, ఏడాది కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమై మౌళిక సదుపాయాలను గుర్తించి అభివృద్ధి చేసి చూపిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, నాయకులు లోకేష్ రెడ్డి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, పాల్గోన్నారు.
