విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే ప్రారంభం…

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్…శంఖవరం కేజీబీవీ లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ల పంపిణీ…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి :– విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే మొదలవుతుందని మొదట తల్లిని గౌరవించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు పర్వత సురేష్ చేతుల మీదుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లను విద్యార్థినిలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి ప్రతి రంగాన్ని వ్యవస్థలను పునర్నిర్మాణం చేస్తూ, అభివృద్ధి సంక్షేమమే తమ అంతిమ లక్ష్యంగా పని చేస్తుందని, ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేస్తూ రాష్ట్ర పరిపాలన విభాగంలో భాగంలో ముఖ్యంగా విద్యావ్యవస్థ బలోపేతం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన, డిజిటల్ తరగతులు, నైపుణ్య శిక్షణ తరగతులను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు మేలు జరిగిందని, ప్రతి విద్యార్థి తల్లిని గౌరవించాలి అనే ఆలోచనతోనే అమ్మ ఒడి నుండి తల్లికి వందనం అనే పేరు మార్చడం జరిగిందని అన్నారు. శంఖవరంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పై ప్రత్యేక దృష్టి సాధించి అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సత్యప్రభ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ ఉప సర్పంచ్ చింతనీడికుమార్, టిడిపి నేతలు బొర్రా లచ్చబాబు, బొర్రా వరప్రసాద్, రౌతు శ్రీను, కేజీబీవీప్రిన్సిపాల్ బి. బాలామణి కుమారి, కేజీబీవీ సిబ్బంది భారీ సంఖ్యలో విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..