

మన న్యూస్,తిరుపతి,:
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన సూర్య తెలుగు జాతీయ దినపత్రిక కార్టూనిస్ట్ నారు ను తిరుపతిలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్టూనిస్టు నారు తమ కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో ఏపీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామనాథం, నాయి బ్రాహ్మణ సంఘం నేతలు నారు తో నాయి బ్రాహ్మణుల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు.