గూడూరు,మన న్యూస్):- తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో AISF విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలను విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎదుట నిరసన వ్యక్తం చేసారు.అనంతరం ఇంచార్జి డిప్యూటీ డిఈవో సనత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి పిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ పాఠశాల పుస్తకాల గదికి అధికారులు తాళం వేశారు.AISF నాయకుల సమక్షంలో డిప్యూటీ డిఈవో సనత్ కుమార్ పుస్తకాలు గదిని సీజ్ చేశారు..విద్యా సంస్థలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని, ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించేలా ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పుస్తకాల గదిని సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *