పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు, : మున్సిపాలిటీ పరిధిలో సైడ్ డ్రైనేజ్
కబ్జా,ప్రహరీ గోడల నిర్మాణాలతో సమస్యలు ఏర్పడుతున్నాయని, మరోవైపు వర్షాకాలంతో ముంపు సమస్యలు పొంచి ఉన్నాయని తక్షణమే అధికారుల చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలంటూ సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు, సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలజీ నగర్ లో తక్కువ స్థలంలో ఆకాశాన్నంటే రీతిలో అక్రమ నిర్మా ణాలు కొనసాగుతున్నాయని, తద్వారా ట్రాఫిక్, తాగునీటి, డ్రైనేజీ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. వెంటనే సదరు నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. కాలనీలో కొందరు ఇంటి యజమానులు సైడ్ డ్రైనేజ్ పై అక్రమంగా ప్రహరీ గోడలు నిర్మించడం డ్రైనేజీలో నీరు పోక కాలనీలో ముంపు సమస్యలు ఏర్పడుతున్నాయని, పేర్కొన్నారు. గతంలో 2022 వరదల సమయంలో డ్రైనేజీ కబ్జాల వల్ల మా ఇళ్లు మునిగిపోవడాన్ని గుర్తించిన అప్పటి ఎమ్మెల్యే గారు సైడ్ వాల్ కూల్చివేయించారని,2024 ఆగస్టు 31న వర్షం కురిసినప్పుడు 256 ఇళ్లు మళ్ళీ మునిగిపోయాయన్నారు. ప్రభుత్వం ప్రతి కుటుంబా
నికి రూ.16,500 నష్టపరిహారం అందించిందన్నారు. మళ్ళీ కొంతమంది కొత్త ఇంటి యజమానులు డ్రైనేజ్ పై భాగాన్ని కబ్జా చేసి ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారని, ఫలితంగా డ్రైనేజీ లో చెత్త తొలగించడానికి మార్గం లేకుండా పోయిందన్నా రు. అలాగే, వీరిలో చాలామంది ఇంట్లో వాడిన మురికి నీళ్లను రోడ్డుపైకి వదులుతున్నారని,దీని వల్ల రోడ్లు బురదగా మారి పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. ఈ సమస్యపై గతంలో తహశీల్దార్,మున్సిపల్ కమిషనర్ గా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ నిర్మాణాలను, అడ్డుకోవాలని, ప్రజలను ముంపు నుండి కాపాడాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *