గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో “ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల మత్తులో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని తెలిపారు. తమ పరిసర ప్రాంతాలలో ఎవరైనా అక్రమంగా మాదక ద్రవ్యాల క్రయవిక్రయాలు జరిపితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టరు వై. శ్రీనివాసులు, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. పీర్ కుమార్, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ సురేంద్ర, కిరణ్మయి, శ్రీధర్ శర్మ, రవి రాజు, శైలజ, పద్మమ్మ, జనార్ధన్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *