మన న్యూస్ గూడూరు:- ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును అమరావతిలో గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా వారు కొన్ని విషయాలపై చర్చించారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. అలాగే విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సమూల మార్పులు గురించి ఎమ్మెల్యేతో మంత్రి లోకేష్ బాబు చర్చించారు .అలాగే గూడూరు నియోజకవర్గ సమస్యలపై మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. వాటిని పరిష్కరించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. బాగా పనిచేసే పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యేకు మంత్రి సూచించారు. ప్రధానంగా నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారుల ద్వారా కృషి చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *