శంఖవరం మన న్యూస్ (అపురూప్):- జీవితంలో కష్టపడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని స్టార్ లైట్ ఫౌండేషన్ సభ్యులు గునపర్తి అపురూప్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్య అధికారి (డి డి ఓ) గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శెట్టు బత్తుల రాజీవ్ కుమార్ ను స్టార్ లైట్ ఫౌండేషన్ సభ్యులు గునపర్తి అపురూప్, బత్తిన తాతాజీ, కొంగు రమేష్ దుస్సాశాలువాలతో సన్మానించి పూల దండలు వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్టార్ లైట్ ఫౌండేషన్ సభ్యులు గునపర్తి అపురూప్ మాట్లాడుతూ, శంఖవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రజలకు అందించిన సేవలకు ఫలితంగానే అదనపు బాధ్యతలు అప్పగించారని, ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఒక చరిత్ర ఉందని, పూర్వ వైభవాన్ని మరల తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవి శంకర్, సిహెచ్ఓ మేరీ మణి, పి హెచ్ ఎన్ కృష్ణ కుమారి, హెచ్ వి వెంకట లక్మి, ల్యాబ్ టెక్నీషియన్ సిహెచ్ రాజశేఖర్, ఫార్మసిస్ట్ చంద్రశేఖర్, ఎంపిహెస్ రామ కృష్ణ, ఏఎన్ఎం గ్లోరీ, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *