

మన న్యూస్ సాలూరు జూన్ 10:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మహిళలను సంకరజాతి అంటారా.. మనుషులా మృగాల సజ్జలకు సమాజంలో తిరిగే హక్కు లేదని మంత్రి సంధ్యారాణి అన్నారు. సజ్జల మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన తీరును మంగళవారం మంత్రి చరవాణి ద్వారా స్థానిక విలేకరులకు తెలియజేశారు. ఆడపడుచులను అవమానపరిచే విధంగా మాట్లాడిన వారిని చొక్కా పట్టుకొని లాగి చట్టప్రకారం శిక్ష వేయించాల్సిన జగన్ ఇలా వెనకేసుకుని రావడం దారుణం అన్నారు. సజ్జల మాటలకు రియాక్ట్ అవ్వాల్సిన కొమ్మినేని శ్రీనివాసరావు వ్యంగ్యంగా నవ్వడం సిగ్గుచేటు అన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసిన కొమ్మినేని శ్రీనివాసరావు ప్రవర్తన హేయమైన చర్య అని అన్నారు. తప్పు చేసిన వారిని మందలించకుండా కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేయడం గవర్నమెంట్ చేసిన తప్పు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి లో ఉన్న ఆడపడుచులలో ఒక్కరు కూడా వైసిపికి ఓటు వేయలేదు అని భావిస్తున్నారా అని అన్నారు. అక్కచెల్లెళ్ల కోసం ఇలా తప్పుగా వైసిపి నేతలు మాట్లాడటాన్ని మంత్రి తప్పు పట్టారు. వైసీపీ నాయకులు ఒక నాయకుల్లా కాకుండా ఒక మృగాల్లా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు . వారి మాటలను. తెలుగుదేశం నాయకురాలులా కాకుండా ఒక మహిళగా బాధపడుతున్నానని అన్నారు. సాక్షి మీడియా మూసివేసే రోజులు దగ్గరపడ్డాయని ఎన్నికలలో వైసిపికి 11 సీట్లు వచ్చినప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. మహిళలపై చేసే వ్యాఖ్యలను బేషరతుగా జగన్, సాక్షి యాజమాన్యం సజ్జల క్షమాపణ చెప్పాలని అన్నారు.