మన న్యూస్,నారాయణపేట జిల్లా:జిల్లా పరిధిలోనీ మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడు తున్న ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని సోమవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పి నల్లపు లింగయ్య నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన సుబ్బమ్ విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి తేది:11.11.2024 నాడు వివాహానికి హాజరై తిరిగి వచ్చే సరికి ఇల్లు తాళం పగలగొట్టి దొంగతనం జరిగింది అనే ఫిర్యాదు మేరకు మక్తల్ ఎస్సై కేసు నమోదు చేయగా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆదేశాలతో డీఎస్పీ పర్యవేక్షణలో మక్తల్ సీఐ, ఎస్సై క్రైమ్ పార్టీతో దర్యాప్తు ప్రారంభించారు. నారాయణపేట రోడ్ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా మక్తల్ పోలీసులు పట్టుకొని విచారించగా వారి పేరు A1 మహమ్మద్ గౌస్ s/o నబీ సబ్, వయస్సు 25 సంలు, నటరాజ్ కాలనీ, సింధనూర్ టౌన్ రాయచూరు, జిల్లా కర్ణాటక రాష్ట్రం. A2 రాయచూర్ హనుమంత s/o ఈశ్వరప్ప వయస్సు 38 సం.లు దేవదుర్గ గ్రామం, రైచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారూ, తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి మొదటగా రక్కీ చేసి తర్వాత దొంగతనాలకు పాల్పడుతుండేవారని వీరు అంతర్రాష్ట్ర నేరస్తులను ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, దేవరకద్ర, మరికల్, మక్తల్ లో దొంగతనాలు చేశారని, కర్ణాటక రాష్ట్రంలో కూడా దొంగతనాలకు పాల్పడ్డారని, అనేక కేసులలో ముద్దాయిలుగా ఉండి జైలు కూడా వెళ్లొచ్చారని వారి వద్ద నుండి 05 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందని వాటి విలువ సుమారు 4,50,000/- రూపాయలు ఉంటుందని డిఎస్పి అన్నారు.ఇలా పలు దొంగతనాల కేసులలో దొంగలు ఉన్న వీరిని ఈరోజు రిమాండ్ తరలించడం జరిగిందని డిఎస్పి తెలిపారు. దొంగతనం కేసులను ఛేదించిన వారిలో మక్తల్ సీఐ రామ్లాల్, ఎస్సైలు భాగ్యలక్ష్మి రెడ్డి, SM నవీద్, క్రైమ్ పోలీసులు అశోక్, శ్రీకాంత్, నరేష్, శశి మొదలగు వారిని డీఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *