తుర్కయంజాల్. మన న్యూస్ అఖిల భారత యువజన సమాఖ్య ( AIYF) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీసుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. టికెట్ల ధరల పెంపుతో సామాన్య ప్రజలతో పాటు, విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడాల్సి ఉంటుందని అంతేగాక రోజువారి పనులు చేసుకునే ఉపాధి కూలీలకు నిరుద్యోగులకు అంతరాయం ఏర్పడుతుందని వారు అన్నారు. నిత్యవసర సరుకుల ధరల పెంపుతో బెంబేలెత్తుతున్న జనం ఇక బస్సు టికెట్ల ధరలు పెంచితే జీవన ప్రయాణం సాగేది ఎట్లా అని వారు ప్రశ్నించారు. ఆర్డినరీ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో డీలక్స్ పాస్ ధరను రూ.1450 నుండి రూ 1800 కు పెంచిన ఆర్టీసీ యాజమాన్యం సకలజనులను దృష్టిలో పెంచుకొని మరోసారి పునరాలోచించాలని వారు అన్నారు. ఆర్టీసీ యజమాన్యం ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికే ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుందని తాము ఆరోపిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *