

Mana News :- ప్రజాశక్తి విలేఖరి ముమ్మిడి లక్ష్మణ్ ను కించపరుస్తూ, ఆయనను డీగ్రేడ్ చేస్తూ, అవమానం చేస్తూ ఫేక్ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్య తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మట్టి మాఫియా పై పోరాడుతున్న రైతులకు ముమ్మిడి లక్ష్మణ్ సంఘీభావం ప్రకటించడం తో అందుకు ప్రతి చర్యగా అతనిని కించపరుస్తూ దుష్ ప్రచారం చేస్తున్న వాళ్ళు మట్టి మాఫియాలే అన్నారు. ఆయన నకిలీ విలేకరి అని ప్రచారం చేస్తున్నారని అయితే ఆయన ప్రజాశక్తిలో గత 20 ఏళ్లుగా సేవలందిస్తున్నారన్నారు. ఆయన నకిలీ విలేకరి కాదాని ప్రజాశక్తి విధానాలకు, విలువలకు కట్టుబడి ఈ కాలమంతటా సేవలు అందించారు, అందిస్తూ ఉన్నారన్నారు. ఆయనపై ఎవరొ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు, ఆయనను అరెస్టు చేసినట్లు ఫోటో షాప్ లో ఒక ఫేక్ పోస్టర్ తయారు చేశారన్నారు. పోలీసులు అరెస్టు చేయకుండానే చేసారని తప్పుడు ప్రకటన ఇచ్చిన వారిపై చర్య తీసుకోవాలన్నారు. మట్టి మాఫియా కు నిజాయితీ ఉండి ఉంటే తమ పేరు, ఇంటి పేరు ఊరు తోటే ప్రకటన ఇచ్చి ఉండేవారన్నారు. మట్టి తవ్వుకు పోవడానికి వ్యతిరేకంగా ఆ గ్రామ రైతులు ఉద్యమించారన్నారు. వారికి సూచనలు, సలహాలు లక్ష్మణ్ ఇచ్చారన్నారు. అందుకు లక్ష్మణ్ పై కక్ష గట్టారన్నారు. ఇలాంటి తాటాకు చప్పళ్లకు ఎవరు భయపడరన్నారు. ఈవిషయం పై తాము పోలీస్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్నామన్నారు. మట్టి మాఫియా కు వ్యతిరేకంగా స్ట్రగల్ కొనసాగుతుందని, దువ్వ శేషబాబ్జి తెలియ చేశారు.