

మన న్యూస్ ,నెల్లూరు ,మే 19: నెల్లూరు రామలింగాపురం వద్దనున్న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో సోమవారం ఉదయం పెన్నా డెల్టా చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విడవలూరు ఈస్ట్రన్ ఛానల్, డిసీ చైర్మన్ పాశం శ్రీహరిరెడ్డి, నీటి సంఘాల అధ్యక్షులు బెజవాడ గోవర్ధన్ రెడ్డి, ఆవుల రవిచంద్ర, దూది విజయ రాఘవన్, టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, ఓగు నాగేశ్వరరావు, ఎస్ కే రఫీ లు పెన్నా డెల్టా చైర్మన్ ని ఘనంగా సన్మానించారు. స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. ప్రస్తుతం రైతులు నార్లు పోసుకున్నారని, 10, 15 , రోజుల్లో వరి నాటేందుకు రైతులు సిద్ధపడుతున్న నేపథ్యంలో సాగునీరుకి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
