

మన న్యూస్, తిరుపతి:– మంత్రి నారా లోకేష్ కు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వినతి. ఆంధ్రరాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు బుధవారం రేణిగుంట విమానశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వినతిపత్రం అందజేశారు. సత్యవేడులో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన మంత్రి శ్రీ నారా లోకేష్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని క్షౌరశాలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు జీవో అమలు చేసి ఆదుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కు భారీగా నిధులను కేటాయించి వారి సంక్షేమం అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేసారు. అలాగే శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆదోనికి చెందిన నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలని గౌరవ మంత్రివర్యులకు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం గారు వినతి పత్రం అందజేశారు.