కూటమి ప్రభుత్వం – 11 వేల కోట్ల భారీ కుంభకోణం.

మన న్యూస్, నెల్లూరు ,మే 6 :-కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోల్లలో చేసిన అక్రమాలను ఆధారాలతో బయటపెట్టిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ……….. కూటమి ప్రభుత్వం 11 నెలలకే భారీ వ్యతిరేకతను మూట కట్టుకుందన్నారు.అధికారం చేపట్టిన నాటి నుంచి 11 నెలల్లో వరుస స్కామ్ లతో.. టిడిపి నేతలు దోచుకోవడం మొదలెట్టారని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని వైసిపి నేతలు ప్రశ్నిస్తుంటే.. కేసుల పేరుతో..వారి నోరు నొక్కేస్తున్నారని అన్నారు.కుటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ల్యాండ్,ఇసుక,లిక్కర్, సిలికా, ను టిడిపి నేతలు అడ్డగోలుగా దోచుకుంటూ వేల కోట్ల రూపాయల అక్రమార్జనే ద్యేయంగా చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 11 వేల కోట్ల అక్రమాలకు తెరలేపిందన్నారు. మే 2 వ తేది ఏపీ విద్యుత్ శాఖ అధికారులు యాక్సిస్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందమే.. ఈ అవినీతికి బీజమన్నారు అన్నారు.
ఇది భారతదేశంలో అతి పెద్ద స్కాం అన్నారు.గత వైసిపి ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెఖీ వద్ద యూనిట్ విద్యుత్ ను 2.49 పైసలకు వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తే దాన్ని లక్ష కోట్ల కుంభకోణమని టిడిపి నేతలు నిందలు వేశారు అన్నారు. ఈరోజు టిడిపి ప్రభుత్వం యాక్సిస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని యూనిట్ విద్యుత్తును 4.60 పైసలకు కొనుగోలు చేసి.. పేద ప్రజలపై 11 వేల కోట్ల అదనపు భారం వేసింది అన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచబోము తగ్గిస్తాము.. అవసరమైతే తగ్గిస్తామని చెప్పి.. ఈరోజు ప్రజల మీదే భారం మోపుతున్నారని అన్నారు.
ఈరోజు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. పేదలపై విద్యుత్ సర్ చార్జీల పేరుతో ఇప్పటికే 15 వేల కోట్ల రూపాయలు వసులు చేస్తున్నారని మండిపడ్డారు.
దీంతో 5000 రూపాయలు విద్యుత్ బిల్లు వచ్చే వారికి..8000 రూపాయల బిల్లు వస్తుందన్నారు.ఈరోజు కూటమి ప్రభుత్వం 4. 60 రూపాయలకు విద్యుత్ కొనుగోలు చేసి 25 సంవత్సరాలకు ఒప్పందం చేస్తుందని.. దీంతో రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని లక్ష్యంతో 7000 మెగావాట్ల విద్యుత్ ను 2.49 పైసలు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి 25 సంవత్సరాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలియజేశారు. ఇంత మంచి ఒప్పందాన్ని కుదుర్చుకున్న జగన్మోహన్ రెడ్డి ని అభినందించాల్సింది పోయి.. చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు టిడిపి ప్రభుత్వం యాక్సిస్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని విద్యుత్ సంస్థలు ఎక్కడ వ్యతిరేకిస్తారో అన్న.. భావనతో టిడిపి ప్రభుత్వం 108 సెక్షన్ ను తీసుకువచ్చి దీన్ని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. ఇది 11 వేల కోట్ల అతిపెద్ద కుంభకోణమని.. దుయ్యబట్టారు. అదే నెల మే 2 వ తేదీన కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి.. రిలయన్స్ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకొని.. యూనిట్ విద్యుత్తును 3.40 పైసలకే కొనుగోలు చేసిన విషయం తెలీదా అని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థలకు చెందిన డిస్కంల్ నష్టాల్లో ఉంటే.. జగన్మోహన్ రెడ్డి గారు.. 47, 800 కోట్ల రూపాయలను డిస్కములకు చెల్లించి.. వాటిని ఆదుకున్నారని గుర్తు చేశారు అన్నారు.టిడిపి ప్రభుత్వం డిస్కములకు కేవలం 13,250 కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించిందన్నారు. రైతులకు సంబంధించి 8840 కోట్ల విద్యుత్ బకాయిలను టిడిపి ప్రభుత్వం.. చెల్లించకుండా వదిలేస్తే వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని చెల్లించడం జరిగిందన్నారు. టిడిపి ప్రభుత్వ సమయంలో డిస్కం లు 86 వేల కోట్ల రూపాయలు అప్పులు ఉండగా.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేవలం 29 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయన్నారు.ఇంకా టీడీపీ లో జరుగుతున్న వరుస కుంబకోణాలు…ఇసుక కుంభకోణం: గత వైసిపి ప్రభుత్వం లో 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ పెట్టుకుంటే .. ఈరోజు కూటమి ప్రభుత్వ నేతలు దాన్నంతా దోచుకొ తిన్నారని మండిపడ్డారు.మద్యం మాఫియా: ఈ రోజు 24 గంటలు 365 రోజులు మద్యం… . బెల్ట్ షాపులు, పెరిగిపోయి.. మద్యం షాపుల్లో పరిమిట్ రూములు ఏర్పాటు చేసి.. సమయం సందర్భం లేకుండా విచ్చలవిడిగా..24 గంటలు మద్యాన్ని సరఫరా చేస్తూ.. ఏపీని మద్య ఆంధ్ర ప్రదేశ్ గా మారుస్తున్నారని ఆరోపించారు.మద్యం మహమ్మారి కారణంగా పేద ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. కుటుంబ కలహాలు ఏర్పడి.. అల్లాడిపోతున్నారని అన్నారు. కేవలం నాలుగైదు నెలల్లోనే.. నెల్లూరులో 25 మర్డర్లు జరిగాయన్నారు.మైనింగ్ మాఫియా నెల్లూరులో మరోపక్క మైనింగ్ మాఫియా కూడా రెచ్చిపోతుందన్నారు.ఒక్క ఇసుక లారీని పట్టుకుంటే.. లక్ష రూపాయలు బహుమతి ఇస్తా అన్న మంత్రి.. టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. 3 లారీలను పట్టుకున్నారు కదా.. ఆ విషయం మంత్రికి గుర్తులేదా అని ప్రశ్నించారు.అమరావతి కాంట్రాక్ట్ సిండికేట్ :అమరావతిలో కూడా రాజధాని పేరిట 15 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తే.. 8% 1200 కోట్లు కమిషన్ల రూపంలో కూటమి నేతలు దోచుకున్నారని మండిపడ్డారు.ఊర్సా కుంభకోణం: ఉర్స భూ కుంభకోణం ఈమధ్య వార్తల్లోకి ఎక్కిందన్నారు.
ఈ ఉర్సా భూకంభకోణం 3 వేల ఎకరాల భూమిని..కూటమి ప్రభుత్వం ఎకరా 99 పైసలకు అప్పనంగా కట్టబెట్టి.. ముడుపులు దండుకున్నారని దుయ్యబడ్డారు. అమరావతి ల్యాండ్ కుంభకోణం: కూటమినేతలు రాజధాని పేరుతో.. 77 వేల ఎకరాలను సేకరించి.. రాజధాని లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు.ఇక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి.. ఇచ్చే పథకాల్లో కూడా అవినీతి.. చోటు చేసుకుంటుంది అన్నారు.బీసీ మహిళల కుట్టు మిషన్ల కుంబకోణం*: బీసీలకు సంబంధించి..లక్ష మందికి కుట్టుశిక్షణ, మిషన్ అందించేందుకు..230 కోట్ల.. లెక్కల్లో చూపి.. 170 కోట్లు దోచుకున్నారన్నారు.జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని ఎంతో ట్రాన్సపెన్సిగా అమలు చేశారని గుర్తు చేశారు.టిడిపి నేతలు ఈరోజు వారి వద్ద పనిచేస్తున్న వారికి.. స్కాములు పేరుతో దోచిపెడుతున్నారని మండిపడ్డారు.ఇదేమిటని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి.. వారిని అణిచివేయాలని చూస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్ ఒప్పందానికి ఉపసంహరించుకొని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని.. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై న్యాయపోరాటం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున,జంగం సెల్ రాష్ట్ర అధ్యక్షులు వావిలేటి ప్రసన్న, కార్పొరేటర్లు కరిముల్లా, నీలి రాఘవరావు,కామాక్షి దేవి, జయలక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్ పేర్నేటి కోటేశ్వర రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వైసిపి యువజన విభాగం నాయకులు కిషన్, 11 డివిజన్ ఇన్ చార్జ్ మహేష్ యాదవ్,5 వ డివిజన్ ఇన్ చార్జ్ సుబ్బారెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్ మస్తాన్, యస్థాని, అలీం, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 7 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…