

మన న్యూస్, గూడూరు, మే 6:- గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో మార్కులు సాధించి అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ప్రోత్సహించేందుకు బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు రావడం ఎంతో అభినందనీయమని తిరుపతి జిల్లా టిడిపి మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి, గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గూడూరు మండల పరిధిలోని చెన్నూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వరుసగా నలగర్ల రమ్యశ్రీ-572, గూడూరు భవ్యశ్రీ-570, ఆదోని చంద్రహాసిని-566 మార్కులు సాధించారు. వీరికి బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోణక మల్లికార్జున్ రెడ్డి(స్ప్లాష్) దాతృత్వంతో నగదు బహుమతులను ముఖ్య అతిథులుగా హాజరైన శ్రావణి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేశారు. ఈసందర్భంగా శ్రావణి రెడ్డి మాట్లాడుతూ గూడూరు మండలంలోని చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు అత్యధిక మార్కులు సాధించి రికార్డు సాధించారన్నారు. తాను కూడా ఇదే పాఠశాల చదివానని పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అంతేకాకుండా ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహాయ సహకారాలతో మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్, సభ్యులు మల్లి, సాయి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మౌలా, ఉపాధ్యాయునిలు విద్యార్థినిల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
*పదవ తరగతి లోఉత్తమ మార్కులు సాధించిన వారికి నగదు బహుమతి
*ముఖ్య అతిధులుగా పాల్గొన్న కమిషనర్ వెంకటేశ్వర్లు,టీడీపీ మహిళ నాయకురాలు శ్రావణి రెడ్డి
