

- కాకినాడ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి (ప్రొటెక్షన్ ఆఫీసర్) జాగారపు విజయ
రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) బాల్య వివాహాలపై జిల్లా యంత్రాంగం సమరభేరి మోగించింది. నియంత్రణకు అందరినీ చైతన్యవంతం చేస్తోంది. అధికారులంతా కదిలారు. క్షేత్రస్థాయిలోని వివిధ విభాగాల ఉద్యోగులు ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోబాల్య వివాహాల రహిత జిల్లా సాధనకై లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కిషోరి వికాసం ద్వారా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని కాకినాడ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి (ప్రొటెక్షన్ ఆఫీసర్) జాగారపు విజయ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో గల శృంగవరం సచివాలయంలో శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి టి డి ఆర్ పద్మావతి ఆధ్వర్యంలో కిషోరీ వికాసం సమ్మర్ క్యాంపెయిన్ లో భాగంగా కౌమార బాలికలకు బాల్య వివాహాల పైన మరియు రుతు క్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి ( ప్రొటెక్షన్ ఆఫీసర్) జాగరపు విజయ పాల్గొని కౌమార బాలికలకు రుతుక్రమ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల మరియు, ఆహారపు అలవాట్ల పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోరి బాలికలు, గ్రామ మహిళా కార్యదర్శి (జి ఎం ఎస్ కె) లు, వివో ఏలు, మరియు అంగన్వాడి సిబ్బందిపాల్గొన్నారు.