

Mana News, శ్రీకాళహస్తి.:- శతాబ్దాల చరిత్ర కలిగిన క్షవర వృత్తిని ఆధారంగా చేసుకొని బ్రతుకు జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.
నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అన్నిటినీ చంద్రబాబు గారి నాయకత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం నెరవేరుస్తున్నదని,అందులో భాగంగానే దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.20 వేల నుండి రూ.25 వేలకు పెంచుతూ నిన్నటి రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. అటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతూ, ఇటు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించిన అనేక పధకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నిలబడుతున్నందుకు తామంతా ఆజన్మాంతం ఋణపడి ఉంటామని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయీ బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు డి.కృష్ణ మూర్తి,గంగనపల్లి రమేష్ బాబు,ఆవులపాటి యుగంధర్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
