

మన న్యూస్,తిరుపతి, ఏప్రిల్ 25 :– జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని నిరసిస్తూ శుక్రవారం తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ర్యాలీ నిర్వహించారు. గాయపడిన పర్యాటకులు త్వరగా కోలుకోవాలని ఆ దైవదైవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్, అధ్యక్షులు రూపేష్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నగరంలోని పలు వీధుల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కార్యదర్శి భాష కోశాధికారి మల్లి, హరి, రాము, కమలాకరరావు, సుబ్రహ్మణ్యం, దేవా, ట్రావెల్స్ యజమానులు, వర్కర్లు పాల్గొన్నారు.
