

మన న్యూస్,కోవూరు, ఏప్రిల్ 24:– తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,దుగ్గిశెట్టి కోటయ్య సత్రం మాజీ చైర్మన్ సోమవరపు సుబ్బారెడ్డి అనారోగ్య కారణంగా గురువారం కోవూరు కోనేటి కయ్యలలోని వారి నివాసంలో శివక్యం చెందారు.సోమవరపు సుబ్బారెడ్డి తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా తెలుగుదేశం పార్టీ కొరకు నిత్యం పనిచేసేవారు.వారు నిత్యం నా శ్రేయస్సు కోరుకునేవారు.వారి మృతితో తెలుగుదేశం పార్టీ నిబద్ధతతో పనిచేసే నాయకుణ్ణి కోల్పోయింది.వారి మృతి తెలుగుదేశం పార్టీకి, వ్యక్తిగతం గా నాకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూర్చాలని,వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ,వారి మృతికి సంతాపం తెలియచేస్తున్నాను అని చేజర్ల వేంకటేశ్వర రెడ్డి. తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తెలియజేశారు.