

గొల్లప్రోలు ఏప్రిల్ 24 మన న్యూస్ :– ప్రవాస భారతీయులు, ప్రముఖ క్యాన్సర్ పరిశోధకులు డాక్టర్ గవరసాన సత్యనారాయణ విద్య, వైద్య రంగాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ జోనల్ మేనేజర్ రెడ్ల శేషగిరిరావు పేర్కొన్నారు. గొల్లప్రోలు లోని గాంధీ నగర్ లో గల శ్రీ స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో స్వచ్ఛ గొల్లప్రోలు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ గవరసాన 5వ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఆయన గవరసాన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శేషగిరిరావు మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం డాక్టర్ గవరసాన పాఠశాల స్థాపించి అభివృద్ధి చేయడమే కాకుండా, మరో పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించారన్నారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఎంతో మందికి వైద్య సహాయం అందించారని తెలిపారు. డాక్టర్ గవరసాన సేవలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు, స్వచ్ఛ గొల్లప్రోలు కన్వీనర్ కొశిరెడ్డి రాజా, కొమ్ము సత్యనారాయణ, చోడపు నీడి పుల్లపరాజు, కర్రి కొండలరావు, మలిరెడ్డి నారాయణరావు పెదిరెడ్ల వెంకట రాజు, చేదులూరి సత్యనారాయణ, మలిరెడ్డి సత్యనారాయణ, బోడకుర్తి మహేష్, కీర్తి ఆదినారాయణ, గుదే నాగు, బి వెంకటరమణ,కంకటాల వాసు, జ్యోతుల సత్తిబాబు, దర్శిపూడి విశ్వేశ్వర రావు, మైనం రాజశేఖర్, భారత శేషారావు తదితరులు పాల్గొన్నారు.
