

గొల్లప్రోలు ఏప్రిల్ 24 మన న్యూస్ ;– ఇంటర్మీడియట్ ఫలితాలలో కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థినిని డాక్టర్ మలిరెడ్డి వెంకట్రాజు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ రెడ్ల శేషగిరిరావు ఘనంగా సన్మానించారు. గొల్లప్రోలు లోని గాంధీ నగర్ లో గల స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని జ్యోతుల సాయి ప్రియ ఇంటర్మీడియట్ లో 983 మార్కులు సాధించినందుకు శేషగిరిరావు సాలువా కప్పి ఘనంగా సత్కరించారు.5 వేల రూపాయల నగదును బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు, స్వచ్ఛ గొల్లప్రోలు కన్వీనర్ కొశిరెడ్డి రాజా, కొమ్ము సత్యనారాయణ, చోడపు నీడి పుల్లపరాజు, కర్రి కొండలరావు, మలిరెడ్డి నారాయణరావు పెదిరెడ్ల వెంకట రాజు, చేదులూరి సత్యనారాయణ, మలిరెడ్డి సత్యనారాయణ, బోడకుర్తి మహేష్, కీర్తి ఆదినారాయణ, గుదే నాగు, బి వెంకటరమణ,కంకటాల వాసు, దర్శిపూడి విశ్వేశ్వర రావు, మైనం రాజశేఖర్, భారతాల శేషారావు, విద్యార్థిని తల్లిదండ్రులు జ్యోతుల సత్తిబాబు, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
