మక్తల్ పట్టణంలో కార్డెన్ సెర్చ్.

మన న్యూస్, నారాయణ పేట:– మక్తల్ మండల కేంద్రంలోని ఆజాద్ నగర్, రెడ్డి నగర్, బురాన్ గడ్డ కాలనీలలో మంగళవారం తెల్లవారుజామున 06 గంటల నుండి 8.30 గంటల వరకు డీఎస్పీ ఎన్ లింగయ్య ఆధ్వర్యంలో ,సీఐ లు 01, ఎస్ఐ -07, ఏఎస్ఐ -03, హెచ్ సి లు 06, పిసిలు, స్పెషల్ పార్టీ సిబ్బంది మొత్తం 75 మంది పోలీసు అధికారులు, సిబ్బంది తో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. 07 పార్టీలుగా విడిపోయి ఏడు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి కొంతమంది వ్యక్తిగత వివరాలు సేకరించి ఎవరైనా కొత్త వ్యక్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అని చెక్ చేసి సుమారు 350 ఇళ్లను సోదాలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. చాలా వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా, సరియైన రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్నాయని అలా గుర్తింపు లేని వాహనాలతో చాలా దొంగతనాలు జరుగుతున్నాయని దొంగతనాలు నిర్మూలించడానికి ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరు వాహనాలకు సంబంధించి పూర్తి పత్రాలు కలిగి ఉండాలని లేనియెలలో వాటిని సీజ్ చేయడం జరుగుతుందని ప్రస్తుతం సీజ్ చేసిన వాహనాలకు సరైన ధృవ పత్రాలు చూయించి తమ వాహనాలు తిరిగి తీసుకెళ్ళాలని డిఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్ లింగయ్య మాట్లాడుతూ, ప్రజల భద్రత పోలీసు బాధ్యత అని మరియు నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని మరియు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు. మహిళల భద్రతే పోలీస్ లక్ష్యం అన్నారు. మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు. ప్రజలు, మహిళలు ఆపద సమయంలో, ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, యువకులు గుంపులు గా ఏర్పడి బహిరంగ మద్యపానం సేవించిన, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. వ్యాపార సముదాయాల దగ్గర, కాలనీ లలో, గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఎవరైనా దొంగతనాలు చేయడానికి అయినా, అమ్మాయిలను, మహిళలను వేధించాలన్న, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడానికి భయపడతారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డిఎస్పి గారు తెలిపారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని డీఎస్పీ తెలిపారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐ రామ్ లాల్, ఎస్ఐ లు భాగ్యలక్ష్మి రెడ్డి, అశోక్ బాబు, ఎస్ ఎమ్ నవీద్, కృష్ణంరాజు, రాముడు, రాజా శేఖర్ , శివ శంకర్, ఏ ఎస్ ఐ లు ఎచ్ సీ లు, జిల్లా స్పెషల్ పార్టీ, పోలీసు కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

పాఠశాల భవనానికి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

శేరిలింగంపల్లి 23ఏప్రిల్ మన న్యూస్:-  కొండాపూర్ డివిజన్  పరిధిలోని  గచ్చిబౌలి లో గల ప్రభుత్వ ప్రైమరీ  హై స్కూల్ ఆవరణలో సిఎస్ఆర్  నిధులతో  రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే నూతన పాఠశాల భవన నిర్మాణం పనులకు జోనల్…

పహాల్గమ్ ఉగ్ర దాడిని కండించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

మన న్యూస్ నర్వ :- *నిన్న సాయంత్రం కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా, పహెల్గాంలో  కొంత మంది పాకిస్థాన్ ఉగ్రమూకలు అమాయకులైన 28 మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా కాల్చి వేసిన ఘటన యావత్ భారతదేశాన్ని కంట తడి పెట్టించే విదంగా చేసిందని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

  • By APUROOP
  • April 24, 2025
  • 2 views
పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

  • By APUROOP
  • April 24, 2025
  • 4 views
కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
ఉగ్రవాద దాడులను నిరసిస్తూ  కొవ్వొత్తుల ర్యాలీ

శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

  • By APUROOP
  • April 24, 2025
  • 2 views
శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—జనసేన— బసవి రమేష్

ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—జనసేన— బసవి రమేష్