

గద్వాల జిల్లా మనన్యూస్ :- ప్రతినిధి ఏప్రిల్ 23 జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తప్పట్లమోర్సు గ్రామానికి చెందిన బొప్పల శ్రీనివాస్ కుమారుడు బొప్పల వినోద్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 979/1000 మార్కులు సాధించాడు, ఈ జాతిలో నుండి మొట్టమొదటగా పై చదువుల వరకు వెళ్లిన విద్యార్థి వినోద్ మాత్రమే ఉండడం విశేషం…. విద్య మాత్రమే ఆత్మ గౌరవం, ఉన్నత స్థానాన్ని ఇస్తుందని, అట్టడుగు జాతుల నుండి ఎదిగి ఈ దేశానికి రాజ్యాంగం అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు నడిగడ్డ నుండి స్వశక్తిగా ఎదిగిన తెలంగాణ రాష్ట్ర మొదటి బీసీ కమిషన్ మెంబర్ డాక్టర్ ఆంజనేయగౌడ్ తనకు ఆదర్శమని అన్నారు… ఇంకా గొప్ప చదువులు చదివి సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగి, నన్ను కన్న తల్లిదండ్రులకు, గ్రామానికి, తమ జాతికి, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తెస్తానని బొప్పల వినోద్ తెలిపారు….. బొప్పల వినోద్ తన కలలను నెరవేర్చుకునేలా ఎదగాలని మనమందరం ఆకాంక్షిస్తూ అభినందనలు అందిద్దాం…