Mana News, Tirupati :- గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేతిలో చావు దెబ్బ తిన్న వైసిపి నాయకులు ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధి నాటకాలతో కుట్రలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం నాయకులు ఆరోపించారు. స్వతహాగా నాస్తికుడు, హిందూ ద్వేషి అయిన కరుణాకర్ రెడ్డి వంటి వారు టిటిడి పైన, గోవిందుని పైన చేస్తున్న విషపూరితమైన కుట్రలను పటాపంచలు చేయడానికి, భక్తులలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి గోశాల వద్దకు చేరుకున్న ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే లకు, నాయకులకు సంఘీభావంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.ఇంటి ముందు హౌస్ అరెస్ట్ డ్రామాలు ఆడుతూ, ఫేక్ రాజకీయం చేస్తున్న భూమనకు గోశాలకు వెళ్ళడానికి పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ ఫేక్ నాటకాలు ఆడటం, వెయ్యి మందితో గోశాలకు వెళ్తే గోవులు బెదిరిపోతాయని, లిమిటెడ్ గా వెళ్ళాలని పోలీసులు చెప్తున్నా వినకుండా, ఎవరూ ఆపకపోయినా రోడ్డు మీద దొర్లుతూ భూమన హై డ్రామా ఆడటాన్ని హిందూ సమాజం గమనించిందని తెలిపారు.జగన్ మార్గదర్శకత్వంలో ఫేక్ డ్రామాలు ఆడుతున్న భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు చెప్పినప్పటికీ, భూమన కుటుంబం, పార్ట్ టైం నటి రోజా తదితరులు ఫేక్ డ్రామాలు ఆడటం ఆపాలని హితవు పలికారు.ధర్మ విరుద్దమైన ప్రవర్తనతో గత కొన్ని రోజులుగా టిటిడి వ్యవహారాలపై అసత్య ఆరోపణలు చేస్తున్న వైసిపి వారికి గోశాలలోని వాస్తవాలను చూపెడతామని ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు భూమన మరియు ఇతర నాయకులను ఆహ్వానించినప్పటికీ, వారికి వచ్చే దమ్ము లేక వీధుల్లో పొర్లుతూ నాటకాలాడి పలాయనం చిత్తగించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తిరుపతి పార్లమెంటు నాయకులు వజ్రం కిషోర్, రామచంద్రయ్య, మునిరెడ్డి, చింతగింజల సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *