

మనన్యూస్,గొల్లప్రోలు:అబాకస్ వేదిక్ రాష్ట్రస్థాయి పోటీలలో గొల్లప్రోలులోని మాధురి విద్యాలయ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు ర్యాంకులు సాధించారు. ఈనెల 14న కాకినాడలో నిర్వహించిన పరీక్షలలో మాధురి విద్యాలయ విద్యార్థి బి గంగా మహేష్ మొదటి ర్యాంకు సాధించగా, వి రాదే శ్యామ్, ఎం షణ్ముఖ మణికంఠ సెకండ్ ర్యాంకు సాధించారు.కె శ్రీ బాలాజీ, టి చిన్మయి దేవి, హర్షిత, కె రామ్ చరణ్, ఎస్ అనూష థర్డ్ ర్యాంకు సాధించారు. గణితం పరీక్షలలో కె విద్యా దీక్షిత, పి. కుశ్వంత్ లు ఫస్ట్ ర్యాంక్ సాధించగా నాగబాబు, కెవి సంతోష్ లు సెకండ్ ర్యాంక్ సాధించారు. రాష్ట్రస్థాయి పోటీలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అభినందించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా తమ్మయ్య నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు గణితం పై ఆసక్తి పెంపొందించుకోవాలని, క్యాలక్యులేటర్ పై ఆధారపడకుండా సొంత మేదస్సుతోనే గణిత సమస్యలనుపరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మమత, పలువురు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
