మన న్యూస్ (శ్రీకాకుళం) ; శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా స్వామి వివేకానంద సేవా సమితి ఆనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు మనసుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. వివరాలలోకి వెళితే… ఈ సంస్థ 2018 లో నవంబర్ 18 న మొదలు పెట్టడం జరిగిందని నిర్వాహకులు బన్నీ రావు, ధర్మ , కిరణ్ మీడియాకి తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ఈ సంస్థను ముగ్గురు జవాన్లు స్థాపించమని తెలిపారు. ఈ సంస్థకి ప్రస్తుతం 1600 మంది వాలంటీర్లు ఉన్నారని చెప్పారు. అయితే ముఖ్యంగా మహిళా విభాగం ప్రెసిడెంట్ వాసవి గారు అని ఆమె మిగతా మహిళలను మరియు యువతని ప్రోత్సహిస్తూ సేవా సమితిని మరింత ముందుకు తీసుకుని వెళ్లిందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో బ్లడ్ కాంప్స్, నిత్య అన్నదానం శిబిరాలు,ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి, బాగా చదివి ఆర్థికంగా స్థోమత లేని విద్యార్థులకి సహాయం చెయ్యడం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు మనసుల్లో ప్రత్యేకంగా నిలిచిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన నగరాలలో సేవలు విస్తరిస్తున్నారు. ఈ సంస్థ కార్యాలయం పలాస మండలం, గొల్లమాకన పల్లి గ్రామంలో ఉందని ఇది కేవలం గ్రామ స్ధాయిలో మొదలు పెట్టీ ప్రస్తుతం జిల్లా స్ధాయిలో సేవలు అందించడం విశేషం.. స్వామీ వివేకానంద సేవా సమితి లక్ష్యం సమాజ మార్పు మరియు నవసమాజ నిర్మాణం కోసం అని నిర్వాహకులు బన్నీ రావు, ధర్మ, కిరణ్ తెలిపారు. ఇప్పుడు వరకు సహరించిన స్ధానిక ప్రజలుకి , యువతకి, సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు