

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం
:ఎండలు పెరుగుతున్న దృశ్య బయట తిరుగుతున్న కార్మిక,కర్షక,వ్యవసాయ కూలీల వంటి కష్టజీవులకు వడదెబ్బ వంటివి తగలకుండా దాహం తీర్చాలని ఉద్దేశంతో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎస్.విజయబాబు ధన సహాయంతో మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టారు.ఈ పంపిణీ కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది.ఈ కార్యక్రమంలో అనేకమంది ప్రజానీకం దాహం తీర్చుకొని,సంతృప్తిగా మజ్జిగని స్వీకరించారని సంఘం సభ్యులు సంతోషం వెల్లుబుచ్చారు.ఈ కార్యక్రమంలో తాళ్లూరి గొల్లజీరావు, డివివి సత్యనారాయణ,తిరగటి సత్యనారాయణ,రౌతు సహదేవుడ, చిదంబరం, సంఘం కార్యదర్శి గోళ్ళ నాగేశ్వరరావు వరుపుల చిట్టిబాబు, కోట శ్రీనివాస చక్రవర్తి,కోరాడ నారాయణరావు సభ్యులు పాల్గొన్నారు.