

నెల్లూరు,మన న్యూస్, మార్చి 12 :-నెల్లూరు వై సి పి నగర నియోజకవర్గ కార్యాలయంలో..సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోలాహలంగా సాగాయి.ఈ సందర్బం గా మహిళా నేతలు కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.అనంతరం నాయకులు కార్యకర్తలు అందరూ మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగు లేని శక్తిగా ఎదుగుతుందన్నారు.రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి చేసుకొనే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో శ్రమిస్తున్నాయని అని తెలిపారు.
