

మనన్యూస్,తిరుపతి:మానవత స్వచ్ఛంద సేవా సంస్థ,రెడ్డి భవన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కరకంబాడి రోడ్డు మార్గంలోని రెడ్డి భవనంలో ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.మానవత సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ ఎన్.వి.కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన నెలవారి సమావేశంలో నూతన అంబులెన్స్ సిద్ధం చేసి విరివిగా సేవలు అందించేందుకు తాము సిద్ధమని పలువురు మానవతామూర్తులు,ప్రముఖ వైద్యులు పేర్కొన్నారు.కో చైర్మన్ రాళ్లపల్లి మాధవయ్య నాయుడు మాట్లాడుతూ అంబులెన్స్ ఏర్పాటుకు లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.మానవత సేవలు విస్తృతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.అధ్యక్షులు ఎంవి రమణ కార్యదర్శి సుకుమార్ రాజు మాట్లాడుతూ అవగాహన సదస్సులు నిర్వహించి సేవలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.రెడ్డి భవనం కన్వీనర్ ఆచార్య చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందించాలని సూచించారు.ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలను కోలా ముని దామోదరం వివరించారు.ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గుండె సంబంధిత వ్యాధులకు ఉచితంగా చికిత్సలు అందించగా డాక్టర్ నవీన్ రెడ్డి జనరల్ సర్జన్, డాక్టర్ కృష్ణజా,డాక్టర్ పల్లవిలు మహిళ సంబంధిత వ్యాధులకు, డాక్టర్ హరి కుమార్ దంత సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో 100 మంది పైగా ఉచితంగా వైద్య సేవలు పొందారు అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వీరితోపాటు రమణయ్య,మల్లికార్జున రెడ్డి,లోకేష్,భాగ్యమ్మ,సుధాకర్,డాక్టర్ ఓబుల్ రెడ్డి,భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.