• అంకిత భావం, క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.
  • ఉద్యోగ నిర్వహణలో బదిలీలు సర్వసాధారణం.

మన ధ్యాస, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా 20 నెలల పాటు విధులు నిర్వర్తించి, బదిలీపై మహబూబ్‌నగర్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న సీఐ రామ్ లాల్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఉద్యోగ నిర్వహణలో బదిలీలు సర్వసాధారణమని, పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి అధికారి ఎక్కడ విధులు నిర్వహించినా అంకితభావంతో, క్రమశిక్షణతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మక్తల్ సర్కిల్‌ ఇన్స్పెక్టర్గా 20 నెలల పాటు విధులు నిర్వహించిన సీఐ రామ్ లాల్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని, కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ప్రాంతంలోనూ తన అనుభవం, నైపుణ్యంతో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.అనంతరం డీఎస్పీ నల్లపు లింగయ్య, ప్రొబేషనరీ డీఎస్పీలు, జిల్లా పోలీసు అధికారులు సైతం సీఐ రామ్ లాల్‌ను శాలువాలతో సత్కరించి, ఆయన సేవలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *