మన ధ్యాస, మక్తల్: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జూనియర్ సివిల్ జడ్జ్, జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కాసర్ల అవినాష్ సూచించారు. శుక్రవారం రోజు జక్లేర్ ఉన్నత పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అందరూ చట్టాలపై కనీస అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. బాలల హక్కులు, వారికి కల్పిస్తున్న సదుపాయాలు, సమాజంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే బాలలకు రాజ్యాంగ అందిస్తున్న కనీస హక్కుల గురించి వారు తెలుసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బాలల హక్కులపై వారికి ప్రత్యేక అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, అడ్వకేట్లు ఆంజనేయులు ప్రవీణ్ కుమార్, పాఠశాల సిబ్బంది, స్థానిక నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *